అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

వారంరోజుల వ్యవధిలో రెండోసారి కాల్పులు

అమెరికాలో కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో గుర్తు తెలియని దుండగుడు ఓ సూపర్‌ మర్కెట్‌లోకి చొరబడి వినియోగదారులపై కాల్పులకు తెగబడిన ఘటనలో పదిమంది మృతి చెందారు. కాల్పుల శబ్దాలతో భయాందోళనకు గురైన స్టోర్‌లోని వినియోగదారులు అందరు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు ‘‘బౌల్డర్‌లోని కింగ్‌ సూపర్‌ మార్కెట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పుల్లో పోలీసు అధికారి సహా మొత్తం 10 మంది మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. దాడికి గల కారణాలేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు’’ అని తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో బౌల్డర్‌ పోలీసులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కడు దురదృష్టకరం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.