క్రైమ్ (Crime) వార్తలు (News)

మల్లారెడ్డి కళాశాల విద్యార్థిని అనుమానాస్పద మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చంద్రిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రిక మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతూ సమీపంలో ఉన్న కృపా ప్రైవేటు వసతి గృహంలో ఉంటోంది. ఈ నేపథ్యంలో వసతిగృహం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో చంద్రిక మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. పోలీసులు, క్లూస్‌ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వసతిగృహం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. విద్యార్థిని చంద్రిక ఫిబ్రవరి 4న వసతిగృహాంలో చేరి పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని మృతికి వివరాలు తెలియరాలేదని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.