దేశంలో బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాలకు చెందిన కొత్త కేసులు ప్రస్తుతం 795కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 18 నాటికి 400గా ఉన్న ఈ కొత్త కేసులు..ఐదు రోజుల వ్యవధిలోనే సుమారు రెట్టింపవ్వడం ఒకవైపు, మరోవైపు దేశంలో మరోసారి కరోనా తన ఉనికిని చాటుతుండడం అందరిని కలవరపెడుతున్న విషయం. ఈ కొత్త రకాలకు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని, వాటి కట్టడికి యువతను కూడా కరోనా టీకా కార్యక్రమం కిందికి తీసుకురావాలని ఆయన ప్రధాని మోదీని అభ్యర్థించారు. దేశంలో కొద్ది రోజులుగా 40వేలకు పైనే కరోనా కొత్త కేసులు నమోదవుతూ ఉండడంతో వరుసగా 13వ రోజు కూడా క్రియాశీల కేసులు పెరిగి 3.45లక్షలకు చేరుకున్నాయి.