అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో జరిగిన ప్రమాదంలో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన కారు లారీని బలంగా ఢీ కొనడంతో కారు డ్రైవర్‌ ప్రభాకర్‌(30), ఉపేందర్‌ నాథ్‌(45), ఆయన కుమారుడు రోషిక్‌(27) ప్రమాద స్థలంలోనే మృతి చెంది మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కారులో ఇరుక్కున్న మృతదేహాలను స్థానికుల సాయంతో బయటకు తీశారు. మృతులు సరూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.