టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఏపీలో నేడు భారీ జాబ్ మేళా .. పూర్తి వివరాలు మీకోసం!!

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, PSR Constructions Pvt Ltd, Innovsource(SBI Cards) తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  1. PSR Constructions Pvt Ltd: ఈ సంస్థలో 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిప్లొమా/B.Tech – Civil&Mechanical అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈ ఖాళీల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. వయస్సు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేల నుంచి రూ. 10 వేల వరకు అందించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
  2. Shriram Life Insurance: ఈ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్ విభాగంలో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ.13,500 వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్, అలవెన్స్ అందించనున్నారు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 32 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో తెలిపారు.
  1. Innovsource(SBI CARDS): బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, ఆపై తరగతులు చదివిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వేతనం చెల్లించనున్నారు. PF+ESI సదుపాయం కల్పించనున్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా http://www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుని అనంతరం ఈ నెల 23న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలను ‘డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్, ఒంగోలు-ప్రకాశం జిల్లా’ చిరునామాలో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒంగోలులో పని చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 9652518187 నంబరును సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •