టెక్నాలజీ (Technology) వార్తలు (News)

త్వరలో నిలిచిపోనున్న బుక్ మార్క్స్ సేవలు : గూగుల్!!

గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఏళ్ళ తరబడి కొనసాగుతున్న పాత సేవలను ఒకదాని వెంట ఒకటిగా మూసేస్తుంది. ఇప్పటికే గూగుల్ లో మ్యూజిక్ సేవలను నిలిపివేయగా తాజాగా బుక్ మార్క్స్ ఆప్షన్ ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 30 నుండి ఆప్షన్ ను నిలిపివేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసింది. క్లౌడ్ అధారంగా ఈ సేవలు ఇప్పటి వరకు గూగుల్ యూజర్లకు అందుబాటులో ఉండడంతో వెబ్ పేజీలను, ఆడ్ లెబెల్స్ ను ముఖ్యమైన నోట్స్ ను బుక్ మార్క్ చేసుకునే అవకాశం ఈ ఆప్షన్ ద్వారా లభించింది.

ఈ బుక్ మార్క్స్ సేవలను నిలిపివేస్తున్న తరుణంలో యూజర్లు బుక్ మార్క్స్ ను ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చని తెలిపింది. ఎక్స్ పోర్ట్ బుక్ మార్క్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి తమ బుక్ మార్క్స్ ను సేవ్ చేసుకోవాలని సూచించింది. స్టార్ మార్క్ చేసిన వెబ్ పేజీలు, ప్రదేశాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని గూగూల్ వివరించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    127
    Shares
  • 127
  •  
  •  
  •  
  •