క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆర్ధిక ఇబ్బందులతో జెన్‌కో ఉద్యోగి ఆత్మహత్య !!

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ జెన్‌కోలో పనిచేస్తున్న మండారి రామయ్య ఉదయం తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతని ఇంట్లో ఉత్తరం పెట్టి అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్‌లోని పైలాన్‌లోని జెన్‌కో కాలనీ 9హెచ్‌లో రామయ్య(36) నివాసముంటున్నారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. తానొక్కడిని చనిపోతే తన భార్య నాగమణి(30), కుమారుడు సాత్విక్‌(12) అనాథలవుతారనే ఉద్దేశంతో వారిని కూడా తోడు తీసుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. కొత్త వంతెనపై అతని ద్విచక్ర వాహనం, చరవాణి ఉండడంతో అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానించి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బంధువులు నదీతీరంలో ఉదయం నుంచి గాలింపు చర్య లు చేపట్టారు. పోలీసులు విచారణ చేపట్టగా రామయ్య, అతడి భార్య, కుమారుడు ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు సీసీ కెమెరాలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తిరుమలగిరి (సాగర్‌) మండలం చింతల పాలెం గ్రామా నికి చెందిన రామయ్య వ్యవసాయ భూమి టెయిల్‌పాడ్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవ్వగా అతనికి నిర్వాసితుల కింద జెన్‌కోలో అటెండర్‌ ఉద్యోగం ఇచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •