క్రైమ్ (Crime) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

మీ ఫోన్ హ్యాక్ అవ్వకుండా చూసుకోండి..!!

ప్రస్తుతం ప్రతిరోజు వందల సంఖ్యలో దేశంలో సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. మన హైదరాబాద్లోనే ప్రతిరోజు పదిమంది వరకు తాము సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

సైబర్ క్రైమ్ లో ఫోన్ల హ్యాకింగ్ కూడా ఒకటి. సైబర్ నేరగళ్లు ఫోన్ లను హ్యాకింగ్ చేసి అందులో ఉన్న ముఖ్యమైన సమాచారాన్నిదొంగలించి బ్యాంక్ లో ఉన్న డబ్బులు అన్నీ కూడా దొచుకుంటారు. కాబట్టి మీ ఫోన్ హ్యక్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. కాబట్టి ఫోన్ హ్యాకింగ్ కు గురైందో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

మీ ఫోన్ లోకి అసంబద్ధమైన పాప్ అప్స్ వస్తుంటాయి. అలా గనక వస్తే మీ ఫోన్ హ్యాక్ కు గురైనట్టే. కొన్నిసార్లు మీకు తెలియకుండా ఫోన్ కాల్స్ మరియు మెసేజ్ లు వెళుతుంటే అది కూడా ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్టే. సాధారణంగా అయితే మనం ఎంతవసేపు ఫోన్ వాడతామో అంతే డేటా ఖర్చవుతుంది. కానీ అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్టు అని గుర్తించాలి. ఫోన్ హ్యాకింగ్ కు గురైతే బ్యాటరీ కూడా త్వరగా అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ పర్ఫామెన్స్ కూడా తగ్గిపోతుంటుంది. దాంతో ఫోన్ ఎప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటుంది.

ఫోన్ హ్యాక్ అయితే మనం డౌన్లోడ్ చేయకుండానే మన ఫోన్ లో యాప్ లు కనిపిస్తాయి. అలా జరిగితే వెంటనే డిలీట్ చేయాలి. కొన్ని సార్లు కొత్త నంబర్ ల నుండి కాల్స్ రావడం జరిగి అప్పుడే ఫోన్ హ్యాంగ్ అవుతుంది అంటే ఫోన్ హ్యాక్ అయినట్టుగా గుర్తించాలి. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ లు కనిపిస్తాయి. అలా జరిగిన మీ ఫోన్ హ్యాకింగ్ కు గురైనట్లు గమనించాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •