జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

నేటి నుంచి మాస్టర్‌కార్డ్ జారీలకు అంతరాయం.. ఆర్బీఐ??

అమెరికాకు చెందిన ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్‌ (Master Card)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాస్టర్ కొత్త కార్డుల జారీపై నిషేధం విధిస్తూ గట్టి షాక్ ఇచ్చింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నేటి నుంచి ఆంక్షలు అమల్లోకి రానుండగా కొత్తగా భారతీయ కస్టమర్లను ఎవరినీ చేర్చుకోవద్దని మాస్టర్ కార్డ్ సంస్థకు ఆర్బీఐ గతంలోనే ఆదేశించినప్పటికీ నేటి నుండి కొత్తగా డెబిట్, క్రెడిట్ కార్డులను జారీచేసే వీలు లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది.

కొత్తగా తీసుకొనే డొమెస్టిక్ డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కస్టమర్ల కార్డులు మూడింటికి ఈ ఆంక్షలు వర్తించనుండగా చెల్లింపుల సమాచారం నిల్వ (Payment systems data)కు సంబంధించిన నిబంధనలను మాస్టర్‌కార్డ్ ఉల్లంఘించినందున ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ (RBI) గతంలో ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •