క్రైమ్ (Crime) వార్తలు (News)

నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్ల కొత్త పంథా??

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు వారి పతా మార్చుకుంటూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. బ్యాంకుల సర్వర్లు హ్యాకింగ్‌ చేయడంతో పాటు ఆయా బ్యాంకుల్లోనే ఖాతాలు తెరిపించి హ్యాకింగ్‌తో సర్వర్‌ను తమ చేతిలోకి తీసుకుంటున్న నేరగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బును వారు ఓపెన్‌ చేయించిన ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఖాతాలు ఓపెన్‌ చేయడంలో సహకరించిన వారికి పెద్ద మొత్తంలో కమీషన్‌ ఇస్తున్నారు. ఈ గ్యాంగులు స్థానికుల సహాయం కూడా తీసుకుంటూ.. వారితోనే కొత్త ఖాతాలు ఓపెన్‌ చేయిస్తున్నారు.

ఈనెల 2న సుప్రియ ఎల్జిబెత్‌ అనే మహిళ పేరుతో టెస్కాబ్‌ బ్యాంకు సికింద్రాబాద్‌ శాఖలో ఖాతా తెరిచారు. అలాగే, చందానగర్‌ బ్యాంకు శాఖలో రఫీ, యాసిన్‌ పాషాతో ఖాతాలు తెరిపించారు. వీరిద్దర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిద్దరితో ఖాతాలు తెరిపించిన నైజీరియన్‌ (టోలీచౌకీ నుంచి) పరారీలో ఉన్నాడు. అతడితో సంబంధమున్న మరో నైజీరియన్‌ డైలాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, సుప్రియ సైబర్‌ ముఠాతో కలిసి పనిచేస్తూ ఇతర రాష్ట్రాల్లోనూ బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •