టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఐటీఐ లిమిటెడ్‌లో హాస్పిటల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!!

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్‌ బెంగళూరు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సంస్థకు చెందిన ఆసుపత్రుల్లో స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నేటితో (జున్‌ 22) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు:
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
స్టాఫ్‌ నర్సు, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్, ఎక్స్‌రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్‌ టెక్నీషియన్, జూనియర్‌ ఫార్మసిస్ట్, రిసెప్షనిస్ట్, హెల్పర్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి.
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. పోస్టుల ఆధారంగా ఏడో తరగతి, పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లలో డిప్లొమా, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం తప్పనిసరి.
అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 28, 30 ఏళ్లు మించకూడదు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు.. మొదట ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం హార్డ్‌ కాపీలను ఆఫ్‌లైన్‌ విధానంలో సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
హార్డ్‌ కాపీలను ఏజీఎం-హెచ్‌ఆర్, ఐటీఐ లిమిటెడ్, బెంగళూరు ప్లాంట్, దూరవాణి నగర్, బెంగళూరు 560016 అడ్రస్‌కు పంపించాలి.
అభ్యర్థులను అప్టిట్యూడ్‌/టెక్నికల్‌ టెస్ట్‌/గ్రూప్‌ టాస్క్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు 22-07-2021 చివరి తేదీ కాగా, హార్డ్‌ కాపీలను 24-07-2021లోగా పంపించాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •