టెక్నాలజీ (Technology) వార్తలు (News)

నూతన విద్యా విధానం అమల్లోకి తీసుకురానున్న తెలంగాణ సర్కార్!!

తెలంగాణలో నూతన విద్యా విధానం అమల్లోకి తీసుకురావడానికి స్కూల్ ఎడ్యుకేషన్ నుండి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు చేస్తూ ఇకపై ఒకటి నుంచి 12 తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ గా నిర్ణయించారు. ఇప్పటికే డిగ్రీలో క్లస్టర్ విధానం, కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు శ్రీకారం చుట్టి అటు పీహెచ్‌డి ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స్ విద్యా విధానం అమల్లోకి రానుంది.

దీని కోసం సమీపంలో ఉన్న స్కూల్స్ కాలేజెస్, గ్రౌండ్స్, లైబ్రరీ మౌలిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటారు. క్లస్టర్ విధానం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లి చదివే విద్యార్థులు సమీపంలో ఉన్న విద్యా సంస్థల్లో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. క్లస్టర్స్ విధానంపై యూనివర్సిటీ వీసీ లతో ఇప్పటికే చర్చించారు ఉన్నత విద్యా మండలి అధికారులు. క్లస్టర్స్ విధానంపై ఉన్నత విద్యా మండలి కమిటీ వేసింది.

కొత్త జాతీయ విద్యా విధానం పై ఇప్పటికే డ్రాఫ్ట్‌ బిల్ రూపొందించగా పార్లమెంట్ సమావేశాల తర్వాత నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా తెలంగాణ సర్కార్ డ్రాఫ్ట్ సిద్ధం చేస్తోంది. జాతీయ ఆదాయంలో 6 శాతం విద్యారంగానికి ఖర్చు పెట్టాలనీ ఎక్స్‌పర్ట్స్ కమిటీ నిర్ణయించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •