అంతర్జాతీయం (International) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

జపాన్ లో నేడు ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ ??

నేడు భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ప్రారంభంకానున్నాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ వేడుకలను జపాన్ చక్రవర్తి నరుహిటో ప్రారంభించనున్నారు. అయితే ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ ను నిర్వహించనున్నారు. మొత్తం 206 దేశాల నుంచి 11 వేలకు పైబడి క్రీడాకారులు ఈ ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనేనుండగా 42 వేదికలపై 33 క్రీడలకు సంబంధించి 339 ఈవెంట్లు జరుగుతాయి. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా ఆలస్యంగా మొదలయ్యాయి.

బాక్సర్ మేరీకోమ్, హాకీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ భారత జెండా ధరించనున్నారు. ఒలింపిక్స్‌లో మొత్తం 119 మంది భారత క్రీడాకారులు పాల్గొనున్నారు. భారత్ తరపున 67 మంది పురుషులు, 52 మంది మహిళలు పాల్గొననున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు క్రీడాకారులు గ్రేమ్స్‌లో పాల్గొనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •