జాతీయం (National) వార్తలు (News)

నేటి మార్కెట్లో జొమాటో జోరు!!

శుక్రవారం ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో మొదలై ఒకదశలో నష్టాల్లోకి జారుకుని ముగిసే సమయానికి తిరిగి పుంజుకుని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేసి చివరకు సెన్సెన్స్‌ 138 పాయింట్ల లాభంతో 52,975 వద్ద స్థిరపడగా నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 15,856 వద్ద ముగిసింది. స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో తొలిసారి నమోదైన జొమాటో షేర్లు ఐపీఓ ధర రూ.76 కాగా దాదాపు 52 శాతం ప్రీమియంతో సూచీల్లో రూ.116 వద్ద లిస్టయ్యింది. చివరకు 66 శాతం లాభంతో రూ.126 వద్ద స్థిరపడింది. లిస్టయిన తొలిరోజే కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1 లక్ష కోట్లకు చేరుకుంది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఐటీసీ,హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ ఎం షేర్లు లాభాల్లో ముగియగా.. హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫినాన్స్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •