వార్తలు (News)

హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం!!

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగి రహదారులు వరద కాలువలను తలపిస్తున్నాయి. వరద నీరు ఇంట్లోకి రావడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం అంటా ఎండతీవ్రంగా ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం మొత్తం మారిపోయింది.

మాదాపూర్, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో విరుచుకుపడుతోంది. రోడ్లన్నీ జలమయం కాగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •