ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కొన్ని వంటింటి సామాన్లు గడువు ముగిసినా వాడొచ్చని మీకు తెలుసా??

వంటింట్లో ఒక్కోసారి కొన్ని పదార్థాలు మర్చిపోయి ఆలా వదిలేస్తే వాటి గడువు తేదీ ముగుస్తుంది దానితో వాటిని పారేస్తాము. కానీ వాటిని మనం ఉపయోగించుకోవచ్చు.

పెరుగు: దీంట్లోని లాక్టిక్‌ ఆమ్లం చర్మాన్ని మెరిపిస్తుంది. చెంచా చొప్పున పెరుగు, తేనెలను కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

కాఫీ గింజలు: రెండు చెంచాల చొప్పున కాఫీ గింజల పొడి కలబంద గుజ్జు తీసుకుని బాగా కలపాలి. దీన్ని ముఖానికి పూత వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. కుండీలో చెంచా కాఫీ గింజలను ఎరువులా వేసి మొక్క నాటితే ఏపుగా పెరుగుతుంది. నీళ్లలో కలిపి మొక్కకు చల్లితే క్రిములు చనిపోతాయి. కాఫీ గింజలు… రెండు చెంచాల చొప్పున కాఫీ గింజల పొడి కలబంద గుజ్జు తీసుకుని బాగా కలపాలి.

మయోనీజ్‌: కాస్తంత మయోనీజ్‌ను పాత టూత్‌ బ్రష్‌పై వేసి స్టీలు అరలను రుద్దాలి. కాసేపాగి నీళ్లు స్ప్రే చేసి పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే తుప్పుతోపాటు మరకలూ వదిలిపోతాయి. ఇలా రిఫ్రిజిరేటర్‌నూ తుడవొచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •