టెక్నాలజీ (Technology) వార్తలు (News)

స్కూల్స్ కి శలవులు ఎప్పుడెప్పుడు ఇచ్చారో తెలుసా??

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 188 పనిదినాలను, 70 సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. 2021 ఆగస్టు 16 నుంచి నెలవారీ పనిదినాలు, సెలవులకు సంబంధించిన క్యాలెండరును విడుదల చేసింది.

అత్యధికంగా అక్టోబరులో 14 సెలవులు రానుండగా పరీక్షలు మాత్రం షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని, పాఠశాలల్లో జరిగే పరీక్షలను టైమ్‌ ప్రకారం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. దసరా సెలవులు అక్టోబర్ 11-16 వరకు ఇస్తారు. దీపావళికి నవంబరు 4న శలవును ప్రకటించారు. క్రిస్మస్ (మిషనరీ బడులకు) సెలవులు డిసెంబర్ 23-30 వరకు ఉంటాయి. సంక్రాంతి సెలవులు జనవరి 10-15 వరకు ఇచ్చారు. ఉగాదికి ఏప్రిల్ 2న సెలవు ఇచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •