జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఆంధ్రప్రదేశ్‌లోని హైస్కూళ్లు 9 నుంచి 4 గంటల వరకే!!

ఆంధ్రప్రదేశ్‌లోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హైస్కూళ్లలో ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు విద్యార్థులకు సెల్ఫ్‌ లెర్నింగ్, సూపర్వైజరీ స్టడీ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గేమ్స్, స్పోర్ట్స్‌ ఉంటాయని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది.

అన్నిటికి ఆయా స్కూళ్ల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లు, ఎస్‌ఏ (పీడీ)లు తప్పని సరిగా హాజరు కావాలి. ఈ సమయాల్లో ఇతర టీచర్ల హాజరు ఆప్షన్‌ మాత్రమే. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు స్కూల్‌ సమయాల్లో హాజరు మినహాయింపు ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •