జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

రైట్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!!

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ కు చెందిన రైట్స్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజనీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు చూడండి!

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు:
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 48 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వీటిలో సివిల్‌-25, మెకానికల్‌-15, ఎలక్ట్రికల్‌-08 ఖాళీలు ఉన్నాయి.
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 32ఏళ్లు మించకూడదు.

ఆసక్తి కల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను పని అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 25.08.2021 నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •