అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆఫ్ఘన్ లో విద్యార్థినుల రికార్డులను తగులట్టిన స్కూల్ యాజమాన్యం!!

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాలిబన్ల నుంచి విద్యార్థినులను వారి కుటుంబాలను రక్షించడానికి తమ స్కూల్లో చదివిన విద్యార్థినుల రికార్డులనన్నీ తగులబెట్టానని ఓ పాఠశాల వ్యవస్థాపకురాలు ఆవేదనతో చెప్పారు. కనీసం ఈ పిల్లల భవిష్యత్తుకైనా భద్రత ఉంటుందని ఆశిస్తున్నానని ఈమె వెల్లడించింది.

ఈ రికార్డులను దగ్ధం చేయని పక్షంలో వీరికి అపాయం కలిగే సూచనలున్నాయని ఆమె వెల్లడించింది. 2002 లో తాలిబన్ల ప్రభుత్వం పడిపోయి ఆఫ్ఘన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం విద్యార్థినులందరినీ స్కూలుకు వెళ్లి ఓ టెస్ట్ రాయమన్నారని, అప్పుడు తానూ ఓ విద్యార్థినినని ఆమె ట్వీట్ చేసింది. ఇన్నేళ్లకు తిరిగి తాలిబన్లు ఇక్కడ అధికారం చేబడుతున్న నేపథ్యంలో ఇక ఈ అమాయక ఆడపిల్లలకు భద్రత ఉండదని ఆమె విచారంగా తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •