అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News)

భారత్‌ To కాబూల్‌కు ప్రతి రోజూ రెండు విమానాలు!!

ఆఫ్ఘానిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ప్రతిరోజు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికాకు చెందిన నాటో బలగాలు అనుమతించాయి. కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్‌ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడపొచ్చని నాటో వెల్లడించింది. ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత అక్కడి ప్రజల భద్రతపై ఆయా దేశాలు దృష్టిపెట్టాయి.

తమ పౌరులను ఆఫ్ఘాన్ నుంచి తరలించేందుకు విమాన సర్వీసులు నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విమాన రద్దీని దృష్టిలో ఉంచుకొని నాటో దళాలు పరిమితి విధించడమే కాక మరోవైపు అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగకుండా రక్షణ కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే నాటో దళాలు తమ ఆయుధాలు, పౌరులను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రోజుకు మొత్తం 25 విమాన సర్వీసులను నడుపుతున్నాయి.

భారతీయ వైమానికదళం (IAF) రవాణా విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి కొంతమంది ఆఫ్ఘాన్ ప్రముఖులు, హిందూ, సిక్కు ప్రజాప్రతినిధులతో పాటు విమానంలో 85 మంది భారతీయులు ఆదివారం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్‌ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్‌ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించినట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •