ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

గజ్జి, తామర నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా.. ఇది మీకోసమే!!

శరీరంపై ఎక్కువగా అలర్జీ సమస్యలు ఉన్నవారు చాలామంది ఉంటారు. అలర్జీ అంటే ముఖ్యంగా గజ్జి, తామర.. వాటిని సరైన సమయంలో చికిత్స చేయించుకుని పోగొట్టుకోకపోతే శరీరం మొత్తం వ్యాపించి శారీరక బాధతో పాటు చూపరులను కూడా ఇబ్బంది పెడుతుంటాయి. దీనికి తోడు ఇవి అంటూ వ్యాధులు. దీని నుండి విముక్తి పొందాలంటే మనం ప్రతిరోజు ఆహారంలో కాకరకాయ తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు.

కాకరకాయలను ముందుగా బాగా కడిగి, ఆ కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా చేసిన వాటిని బాగా పేస్ట్ లా చేసుకోవాలి. అందులోకి కర్పూరం వేసి, బాగా నూరి పొడి కలుపుకోవాలి. ఎక్కడైతే చర్మం మీద గజ్జి , తామర కనిపించిస్తాయో, వాటిపై ఆ మిశ్రమాన్ని పట్టించడం వల్ల అవి తొందరగా మాయమవుతాయి. కాకరకాయలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తులు వల్ల, ఫంగస్ ఇన్ఫెక్షన్ లు నివారించడానికి చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిని ముఖానికి కూడా పట్టించి నట్లయితే మొటిమల సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

మరొక చిట్కా కూడా గజ్జి , తామర లను దూరం చేస్తుంది అదేంటంటే.. వేపాకు! ఇది చాలా తొందరగా చర్మ వ్యాధులను నయం చేస్తుంది. మనకు దురద వల్ల ఏర్పడిన నల్లటి మచ్చలను తొందరగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వేపాకు ఎన్నోరకాల ఔషధగుణాలను కలిగి ఉంటుంది. ఇక ఇది అనేక రకాల చర్మవ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాలిన గాయాలను ఈ వేపాకులను బాగా నూరి పేస్టు రూపంలో పట్టిస్తే, అవి తొందరగా మానిపోయే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇలాంటి చిట్కాలను పాటించి మీ చర్మ సంబంధ సమస్యలను దూరం చేసుకోండి!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •