టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఫ్లిప్‌ కార్ట్ లో 80 శాతం డిస్కౌంట్..!

చాలామంది ఏదయినా వస్తువు కొనాలనుకుంటే అది ఆఫర్ లో మాత్రమే కొని డబ్బు ఆదా చేసుకోవాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఫ్లిప్‌ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ల తో కస్టమర్ల ముందుకు వస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దామా..!

బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 తేదీలను ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సేల్ అక్టోబర్ 7 నుంచి 12 వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ముందు ఈ సేల్ ముందే ప్రారంభమౌతుంది. ఇది ఇలా ఉండగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కలిగిన వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది గమనించండి.

అలాగే పేటీఎం కస్టమర్లకు క్యాష్‌ బ్యాక్ కూడా వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉంటాయి. రివార్డు పాయింట్లు వంటివి గెలుచుకోవచ్చు. ఇక ఆఫర్స్ విషయం లోకి వస్తే ఈ బిగ్ బిలియన్ సేల్స్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్ససరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది, టాప్ సెల్లింగ్ టీవీలపై 70 శాతం వరకు, ఫ్రిజ్‌లపై 50 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అలానే బ్యాగ్స్, డ్రస్‌లు వంటి వాటిపై కూడా 60 నుంచి 80 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •