క్రైమ్ (Crime) వార్తలు (News)

ఏజెన్సీలో విస్తృతంగా పోలిసుల తనిఖీలు!!

మంగళవారం నుంచి మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎస్‌ఐ ఆర్‌.సంతోష్‌ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టి.. బాంబు స్క్వాడ్‌ కల్వర్టులను, వాహనదారులను క్షణ్ణంగా తనిఖీ చేసింది. ఎఒబి సరిహద్దు ప్రాంతమైన మాచ్‌ఖండ్‌, ఒనకఢిల్లీ ప్రాంతాల్లో ఒడిశా పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. కుమడ, జోలాపుట్‌ సరిహద్దు, కుజబంగి ప్రాంతాలు పోలీసు బలగాల నిఘాలో ఉన్నాయి. పెదబయలులో స్థానిక ఎస్‌ఐ పి.మనోజ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు బంగారు మెట్ట, ఆరాడ కోట, చుట్టమెట్ట, మంగబంద, గలగండ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి.

ముఖ్యంగా ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌ జిల్లాలకు చెందిన ఎస్‌ఒజి, బిఎస్‌ఎఫ్‌, ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్‌లో నిమగమయ్యాయి. అటు చత్తీస్‌ఘడ్‌ సరిహద్దులో కూడా ఒడిశా బలగాలు గాలింపు చర్యలను విస్తృతం చేశాయి. వారోత్సవాల తొలిరోజైన మంగళవారం అన్ని ప్రాంతాలకూ రవాణా వ్యవస్థ యధావిధిగానే కొనసాగింది. వారపు సంతలు జరిగాయి. పాడేరు ఎఎస్‌పి జగదీష్‌ ఆదేశాల మేరకు అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బందితో పాటు సిఆర్‌పిఎఫ్‌, స్పెషల్‌ పార్టీ పోలీసు బలగాలు ప్రధాన రోడ్లలో మకాం వేసి వాహనాల తనిఖీలు చేస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    11
    Shares
  • 11
  •  
  •  
  •  
  •