జాతీయం (National) వార్తలు (News)

కొత్త గరిష్ఠాలకు చేరిన మార్కెట్ సూచీలు!

నేటి ఉదయం 59,275 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరి వరకు అదే ఒరవడిలో కొనసాగింది. ఒక దశలో వెయ్యికి పైగా పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ సూచీ చివరికి 958.03 పాయింట్ల లాభంతో 59,885.36 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 276.30 పాయింట్లు లాభపడి 17,823 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో టాటా మోటార్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, కోల్‌ ఇండియా ప్రధానంగా లాభపడ్డాయి. ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •