వార్తలు (News)

భారత్‌లో ఎక్కువమంది సంతానం కలిగి ఉన్న ముస్లింలు!!

భారతదేశంలో ముస్లింలు ఇతర మతాలవారికన్నా సగటున ఎక్కువమంది సంతానాన్ని కలిగి ఉన్నారని, జైనులు సగటున అతి తక్కువ మంది సంతానాన్ని కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన ప్యూరిసెర్చ్‌ అధ్యయనంలో తేలింది. మొత్తంగా చూస్తే భారత్‌లో అన్ని మతాల సంతానసాఫల్య రేటు క్రమంగా తగ్గుతున్నట్టు, 1992లో ముస్లిం మహిళలు సగటున 4.4 మంది సంతానాన్ని కలిగి ఉండేవారు(అంటే ప్రతి 100 మంది ముస్లిం మహిళలకు 440 మంది పిల్లలు ఉండేవారు), 2015 నాటికి ఆ రేటు 2.6కు తగ్గింది. హిందూ మహిళలు 1992 నాటికి సగటున 3.3 మంది పిల్లలను కలిగి ఉండేవారు. 2015 నాటికి ఆ రేటు 2.1కి తగ్గింది. 2011 జనగణన ప్రకారం భారతదేశ జనాభా 120 కోట్లమందిలో 79.8% మంది హిందువులు. 2001 లెక్కలతో పోలిస్తే 2011 జనగణన నాటికి హిందువుల సంఖ్య కేవలం 0.7 శాతమే తగ్గింది. ముస్లిం జనాభా 2011 నాటికి 14.2 శాతానికి చేరినట్టు తేలింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •