భారత్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 7,495 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.47 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 434 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,78,759 కు చేరింది. గత 24 గంటల్లో 6,960 మంది కోలుకోవడంతో ఇపప్టివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 3.42 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 78,291 క్రియాశీల కేసులున్నాయి.

దేశంలో ఓమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఓమిక్రాన్ కేసుల సంఖ్య 236కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 65 మంది ఒమిక్రాన్ బారినపడగా, దిల్లీలో ఆ సంఖ్య 64కి చేరింది.