దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాల్లో ముగిసాయి. ఉదయం సెన్సెక్స్‌ 57,231 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై తరువాత రోజంతా లాభాల్లోనే కొనసాగి చివరికి 384.72 పాయింట్ల లాభంతో 57,315.28 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 117.10 పాయింట్ల లాభంతో 17,072.60 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో ఓఎన్‌జీసీ, ఐవోసీ, ఐటీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, సిప్లా షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్‌, దివీస్‌ ల్యాబోరేటరీస్‌, సన్‌ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు ననష్టాలు మూటగట్టుకున్నాయి.