ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 641 టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్స్‌లో 25 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 2021 డిసెంబర్ 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 10 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతల గురించి, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

IARI Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే…
  
మొత్తం ఖాళీలు641
అన్‌రిజర్వ్‌డ్286
ఈడబ్ల్యూఎస్61
ఎస్‌సీ93
ఎస్‌టీ68
ఓబీసీ133
IARI Recruitment 2022: హైదరాబాద్‌లోని ఖాళీల వివరాలు ఇవే…
మొత్తం ఖాళీలు25
ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, హైదరాబాద్8
ఐసీఏఆర్- సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, హైదరాబాద్6
ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, హైదరాబాద్6
ఐసీఏఆర్- నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్2
ఐసీఏఆర్- డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్, హైదరాబాద్2
ఐసీఏఆర్- నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మీట్, హైదరాబాద్1

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

2021 డిసెంబర్ 18 నుండి దరఖాస్తు ప్రారంభమై 2022 జనవరి 10 కి ముగుస్తుంది.
పరీక్ష తేదీ ని 2022 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 గా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు టెన్త్ పాస్ అయి ఉండాలి. వీరి వయస్సు 2022 జనవరి 10 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.700 ఎగ్జామ్ ఫీజు, రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించాలి.
వేతనం- రూ.21,700 బేసిక్ వేతనంతో పాటు ఏడో పే కమిషన్ లెవెల్ 3 ఇండెక్స్ 1 అలవెన్సులు లభిస్తాయి.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ ఎగ్జామ్
పరీక్షా విధానం- 100 ప్రశ్నలతో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.

దరఖాస్తు విధానం : అభ్యర్థులు https://www.iari.res.in/ వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో టెక్నీషియన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. నియమనిబంధనలన్నీ చదివి PROCEED TO REGISTER పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పోస్టు పేరు సెలెక్ట్ చేయాలి. అభ్యర్థి పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. విద్యార్హతలు, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి. ఫోటో, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.