దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్ ను మొదలుపెట్టాయి. ఉదయం 9.24 సమయంలో సెన్సెక్స్ 269 పాయింట్లు పెరిగి 57,199 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 17,034 వద్ద ట్రేడవుతున్నాయి. గ్రేట్ ఎస్టీమ్, అవ్రమ్ ప్రాపర్టీస్, ఓరియంటల్ కార్బన్, పీఎస్పీ ప్రాజెక్ట్స్, ప్రిజమ్ జాన్సన్ లాభాల్లో పయనిస్తుండగా పీఎన్బీ హౌసింగ్, అపోలో పైప్స్, రెస్పాన్సీవ్ ఇండస్ట్రీస్, ఆటోమోటీవ్ యాక్సిల్స్, కాప్రిన్ గ్లోబల్ క్యాపిటల్, హూస్టన్ ఆగ్రో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.