వార్తలు (News)

226 ఏళ్ళ ముసలి చేప

హనాకో అనే జపాన్ చేప సుదీర్ఘ కాలం పాటు బతకిన చేపగా రికార్డు కొల్లగొట్టింది. 1977లో చనిపోయిన చేప దాదాపు 226ఏళ్ల పాటు బతికినట్లుగా తేలింది. స్కార్లెట్ కలర్ లో 1751లో ఈ ఆడ చేప పుట్టింది. దీని పేరు హిరో. మామూలుగా సగటు ఈ రకమైన చేప 40ఏళ్లు బతుకుతుంది.

1966లో దాని చివరి యజమాని డా.కొమేరీ కోషిహరా నిప్పోన్ హోసో క్యోకై రేడియో స్టేషన్లో ఆ చేప గురించి చెప్పారు. యానిమల్ సైన్స్ ల్యాబ్ లో దీనిపై పరిశోధన జరిపి దాని వయస్సును కన్ఫామ్ చేశారు. హిరో శరీర భాగాలను రెండుగా విడదీసి రీసెర్చ్ చేశారు.

1966లో చెప్పిన వివరాల ప్రకారం.. ఇదింకా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. చక్కగా ఈదగలుగుతుంది. తక్కువ దూరాల వరకూ బాగానే వెళ్లగలుగుతుంది. 70సెంటీమీటర్ల పొడవున్న ఈ చేప 7.5కిలోగ్రాముల బరువు ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. తనని నేను హనాకో.. హనాకో అని పిలుస్తాను. కొన్ని సార్లు తనని నీళ్లలో నుంచి తీసి వేరే చోట వేస్తుంటాను.

అప్పుడప్పుడు తలపై సరదాగా కొడితే నా వైపే చూస్తూ ఉండిపోతుంది. ఓ చేపగా అది ఇతరులను బాగా ప్రేమిస్తుంది. మా ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది. మా ఊరు వెళ్లినప్పుడల్లా నెలకు రెండు మూడు సార్లు దానిని కలుస్తానని చెప్పాడు.

చెట్టుకు ఉండేలా ఆ చేప ముక్కుపై కూడా రింగులు ఉన్నాయి. దానిని బట్టే చెప్పొచ్చు వయస్సెంతో. కొషిహరా కుటుంబంలో చాలా జనరేషన్స్ ను చూస్తూనే ఉంది ఆ చేప.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.