ఈక్వెడార్ లోని జిల్లాలోని ఖైదీల మధ్య చెలరేగిన అల్లర్లలో ఇప్పటికి మొత్తం 62 మంది మరణించారు. మరి కొంతమంది గాయపడ్డారు.మొత్తంగా మూడు జైళ్లలో హింసాకాండ చెలరేగగా దక్షిణ క్యూకాలోని జైలులో 33 మంది గుయాక్విల్ జైల్లో 21 మంది, లాటాకుంగాలోని మరొక జైల్లో 8 మరణించినట్టు జైళ్ల నిర్వహణ సంస్థ డైరెక్టర్ స్పష్టం చేసారు. ఈ హింసాకాండలో కొంతమంది పోలీసులు సైతం గాయపడ్డారు. సోమవారం ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. వారిని అదుపు చేసే క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ఘర్షణలను అదుపులో పెట్టడానికి జైళ్లలో భారీగా బలగాలను మోహరించారు. ఈ ఘర్షణకు కారణం కారాగారంలో ఆధిపత్యం కోసం రెండు గ్రూపుల మధ్య చెలరేగిందని అది పరస్పర దాడులకు దారి తీసిందని జైలు అధికారులు పేర్కొన్నారు.