హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌ కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం లో ఒక గర్భిణీ మరణించారు. ముషీరాబాద్‌కు చెందిన సతీశ్‌గౌడ్‌, శాలిని దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ క్రమంలో మహిళ బస్సు వెనుక చక్రాల కింద పడిపోయారు. మహిళకు తీవ్రగాయాలు అవ్వడంతో నారాయణగూడ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఎత్తుకుని అటుగా వెళ్తున్న ఒక అంబులెన్స్‌లో ఎక్కించి స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించగా తీవ్ర రక్తస్రావంతో గర్భిణి చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతురాలి భర్త సతీశ్‌గౌడ్‌ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.