క్రైమ్ (Crime)

కళాశాలకు వచ్చిన ఓ విద్యార్థిని జాతీయ రహదారి పక్కన అచేతనావస్థలో….

 కళాశాలకు వచ్చిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఒంటి నిండా కాలిన గాయాలతో, నగ్నంగా జాతీయ రహదారి పక్కన అచేతనావస్థలో కనిపించిన దిగ్భ్రాంతికర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో జరిగింది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్‌ ఆధ్వర్యంలోని ముముక్షు ఆశ్రమం నిర్వహిస్తున్న స్వామి సుఖ్‌దేవానంద్‌ కళాశాలలో ఆమె బీఏ రెండో ఏడాది చదువుతోంది. సోమవారం తన తండ్రితో కలసి ఆమె కళాశాలకు వచ్చింది. తరగతులు ముగిసినా ఆమె బయటకు రాకపోవడంతో తండ్రి తన కోసం వెతకడం మొదలెట్టారు. కాసేపటి తర్వాత ఆమె లఖ్‌నవూ-బరేలీ జాతీయ రహదారి పక్కన పడిపోయి ఉందని సమాచారం అందింది. పోలీసులు ఆమెను లఖ్‌నవూలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు 60 శాతం కాలిన గాయాలయ్యాయని, ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేదని, ఆమె కోలుకున్నాకే ఏం జరిగిందన్నది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.