రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల నాగరాజు..

TV చర్చలు ప్రజాస్వామ్య యుతంగాను,ప్రజల కు జవాబు దారిగాను,నిష్పక్షపాతంగాను ఉండాలి. కానీ నిన్నటి రోజు ABN TV డిబేట్ సందర్భంగా జరిగిన పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి పై జరిగిన దాడి ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇది ప్రజాస్వామ్య కు మంచింది కాదు, ఇప్పటికే ఆంద్రప్రదేశ్ లో కులాల కుంపటితో రగిలిపోతున్నారు దీనిని మీడియా నియంత్రణ చేయాలని ఇలాంటి చర్చల సందర్భంగా నాయకులు వ్యక్తిగత దూషణలు లేకుండా అంశంపై మాత్రమే తమ అభిప్రాయాలను తెలియజేయాలని మీడియా సమనవ్యయ కర్తలు ఒక పార్టీ స్టాండ్ తీసుకోవద్దని ప్రజల పక్షాన మీడియా పని చేయాలని కాంగ్రెస్ పార్టీ ఛానెల్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నది..

విష్ణు వర్ధన్ రెడ్డి మీద దాడి చేసిన వ్యక్తి కి పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆయన ను ఏ చానల్ వారు కూడా చర్చలకు పిలవకుండా ఆంక్షలు విధించాలని ,ఇలాంటి పరిణామాలు జరగకుండా నాయకులు బాధ్యత గా నడుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల నాగరాజు విజ్ఞప్తి చేస్తున్నారు.

.