దేశమంతా రైతు ఆందోళనలతో నిండిపోతే ధోని మాత్రం కూల్‌గా సొంత ఊరిలో సేంద్రియ వ్యవసాయం చేసుకుంటున్నారు. కూరగాయలు, పండ్లతో పాటు, పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేయడంతో పాటు, బాగా పనిచేసిన వారికి ఆవును కూడా ఇస్తానంటున్నారు.

43 ఎకరాల భూమిలో వివిధ పండ్లు, కూరగాయల తోటలను ధోనీ సాగు చేస్తున్నారు. స్ట్రాబెర్రీలతోపాటూ పైనాపిల్, సీతాఫలం, జామ, బొప్పాయి, ఉల్లిగడ్డలు, టమాటాలు, సొరక్కాయలు, పచ్చి బఠాణీలు, పుచ్చకాయలు, కాలీఫ్లవర్ కూడా పండిస్తున్నారు. వీటితో పాటూ నాలుగువైపులా మామిడి చెట్లు పెట్టారు.