వార్తలు (News)

ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి గుంటూరు-కాచిగూడ-గుంటూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం

గుంటూరు-కాచిగూడ-గుంటూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. లాక్‌డౌన్‌తో రద్దయిన ఈ రైలును తిరిగి పునరుద్ధరించనున్నారు. ఏప్రిల్‌ 1 న రాత్రి 7 గంటలకు గుంటూరులో బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్‌, కర్నూల్‌ సిటీ, జోగులాంబ గద్వాల, వనపర్తి రోడ్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌ మీదుగా మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఏప్రిల్‌ 2 న కాచిగూడలో మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు తిరిగి గుంటూరుకు చేరుకుంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.