కోదండరెడ్డి కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు, ప్రెస్ మీట్, గాంధీ భవన్.

రాష్ట్రంలో 450 విత్తన కంపెనీలు రైతులను మోసం చేస్తూన్నాయి. విత్తన పంటలు మాత్రమే కొనుగోలు చేస్కోవడం వల్ల రైతులకు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వేధిస్తున్నారు
సూపర్ అగ్రి సీడ్స్ హైదరాబాద్ కంపెనీ రైతుల పేరిట 18 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నాయి.రైతులు బ్యాంక్ లకు పోతే ఎకరానికి 50 వేలు కూడా ఇవ్వని బ్యాంకులు ఇప్పుడు విత్తన కంపెనీలతో కుమ్మక్కు అయ్యి కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాయి.రాష్ట్రంలో ముఖ్యమంత్రి విత్తనాలు ఇస్తానని చెప్పడంతో రైతులు విత్తన కంపెనీలను నమ్ముతున్నారు.

ఈ నకిలీ విత్తన కంపిణీల విషయంలో మేము గతంలో అనేక సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన ఫలితం లేదు.రాష్ట్రంలో సమగ్ర విత్తన విధానం ఇంకా రూపొందించలేదు.రైతులు అప్రమత్తంగా ఉండాలి. విత్తన కంపిణీల మోసాలను అర్థం చేసుకోవాలి. ఏ కంపెనీతో అగ్రిమెంట్లు చేసుకోవద్దు.

బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వరు కానీ కంపెనీ దళారులకు మాత్రం కోట్ల రూపాయల అప్పులు రైతుల పేర్ల మీద ఇస్తున్నారు అని అన్నారు.