ప్రేమ పేరుతో కొంతమంది ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు.వేరే వేరే కారణాలు చెప్పి ప్రేమించిన వారిపైనే దారుణాలు చేస్తున్నారు.చేసిన దారుణాలకు శిక్షలు పడుతున్నా కానీ వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు.నరసారావు పేట శివారులో ఇలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది.కోట అనూష అనే విద్యార్థిని హత్యకు గురి అయింది.అనూష స్వస్థలం గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ల మండలం గొల్లపాడు.కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో మరొకరితో చనువుగా ఉంటున్న కారణంగా విష్ణువర్ధన్ రెడ్డి అనుమానం పెంచుకుని, అవకాశం దొరకగానే హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసారు.అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారు.ఈ ఘటనపై కేసు నమోదు చ్రసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.