క్రైమ్ (Crime)

7 అడ్రస్‌లతో 72 మంది బంగ్లాదేశీయులకు పాస్‌పోర్టులు

శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడిన ముగ్గురు బంగ్లాదేశీయుల నుంచి స్వాధీనం చేసుకున్నవి నకిలీ పాస్‌పోర్టులు కావని, అసలైన పాస్‌పోర్టులే కానీ వారు అక్రమ మార్గాల్లో పొందారని సైబరాబాద్‌ పోలీసులను ఉటంకిస్తూ కొన్ని పత్రికలూ కథనాలు ప్రచురించాయి.
‘‘బోధన్‌ కేంద్రంగా మూడేళ్లపాటు సాగిన ఈ కుంభకోణంలో మొత్తం 72 మంది బంగ్లాదేశీయులు అడ్డదారిలో కేవలం 7 చిరునామాలతోనే పాస్‌పోర్టులు పొందినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. వారిలో 19 మంది ఇప్పటికే విదేశాలకు పారిపోయారని వివరించారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని కమిషనర్‌ సజ్జనార్‌ వివరించారు. అక్రమంగా పాస్‌పోర్టులు పొందిన 72 మంది బంగ్లాదేశీయుల్లో 12 మందికి బోధన్‌కు చెందిన మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు మతీన్‌ అహ్మద్‌ మీర్జా అక్రమంగా ఆధార్‌ కార్డులు జారీ చేయించగా, మిగిలిన 60 మంది పశ్చిమ బెంగాల్‌లో వాటిని పొంది, ఇతడి ద్వారా చిరునామా మార్పు చేయించుకున్నారు.

ఈ కుంభకోణంలో నిందితులు కేవలం 5 ఫోన్‌ నంబర్లు, 7 చిరునామాలు వినియోగించగా ఇలా జారీ అయిన 72 పాస్‌పోర్టుల్లో 42 వెరిఫికేషన్లను ఎస్సై మల్లేశ్, 30 వెరిఫికేషన్లను ఏఎస్సై అనిల్‌ చేశారు.

ఇలా పొందిన పాస్‌పోర్టులతో 19 మంది విదేశాలకు వెళ్లిపోగా, ముగ్గురు శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. మిగిలిన 50 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు సమీర్, మనోజ్, సద్దాం హుస్సేన్‌ మినహా మిలిగిన వారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం లుక్‌ ఔట్‌ సర్క్యులర్స్‌ జారీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు’’ అని తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.