ఈ ప్రపంచం లో ప్రతి వస్తువుకి నకిలీ వస్తువు తయారవుతుంది.అలాగే కరోనా నకిలీ రిపోర్ట్ లు కూడా దొరుకుతున్నాయి. అందుకే అంతర్జాతీయ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని క్యూ ఆర్ కోడ్ ఉన్న నివేదికలను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికి యూ ఏ ఈ తో పాటు ఆ దేశం మీద నుండి వెళ్లే అన్ని విమాన ప్రయాణికులను ఈ నిబంధనలను పాటించాలని దుబాయ్ హెల్త్ అథారిటీ ప్రకటించింది. దీంతో ఆ దేశాలకు ప్రయాణించే విమాన సంస్థలన్నీ తమ ప్రయాణికులకు క్యూ ఆర్ కోడ్ ను తప్పనిసరి చేసాయి. రిపోర్టుపై క్యూ ఆర్ కోడ్ ను ఎయిర్ పోర్ట్ సిబ్బంది స్కానింగ్ చేసినప్పుడు అది ఏ ల్యాబ్ లో తీసుకున్నారో, ప్రయాణికుడి పేరు, కరోనా ఉందా? లేదా? అన్న వివరాలు తెలిసిపోతాయి. 72 గంటల వరకు చెల్లుబాటు అయ్యేలాగా అంతర్జాతీయ ప్రయాణికులు కరోనా పరీక్షలో నెగిటివ్ ఫలితాలు వచ్చినట్టు అధికారికంగా నిరూపించుకోవాలి అనే నిబంధన ఉంది. అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రం రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమైరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీపీసీఆర్) టెస్ట్ లో నెగిటివ్ రావాలి. వారిని విదేశీ ప్రయాణాలకు అనుమతిస్తున్నారు.3 రోజులపాటు ఈ రిపోర్ట్ చెల్లుబాటు అవుతుంది.

ప్రస్తుతం చాల చోట్ల ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్ లు అధిక మొత్తం లో డబ్బులు తీసుకుంటున్నాయి.ప్రభుత్వం ఈ టెస్టును రూ.500 కు తగ్గించినా కూడా ఎవ్వరు దానిని పాటించడం లేదు. అది కూడా 24 గంటల తర్వాత నివేదిక ఇస్తున్నాయి.
అధిక ధరలు, నిరీక్షణకు తోడుగా కరోనా బయట పడితే ఎక్కడ ప్రయాణం వాయిదా వేయవలసి వస్తుందో అని చాల మంది అడ్డదారులు తొక్కుతున్నారు. నివేదికలపై ప్రయాణికుల పేర్ల తో పాటు ఫోటోలు లేకపోవడం వల్ల ఏది నిజమైనది అన్నది గుర్తించడం కష్టతరమవుతుంది.అలా కాకుండా నివేదిక ఇచ్చినప్పుడు పేరు తో పాటు ఫోటో కూడా ఉంటె నకిలీ నివేదికలను నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది.