వివాహేతర సంబంధం పెట్టుకోవాలనే కారణంతో భర్తనే హతమార్చింది ఒక ఇల్లాలు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో జరిగిన హత్యపై విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పవన్ అనే వ్యక్తి డెహ్రా గ్రామం జానీ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజులుగా కనిపించకుండాపోయాడు.

ఫిబ్రవరి 16న ఘాజియాబాద్ లోని గంగా కాలువలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి శుక్రవారం జైలుకు పంపించారు. భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా తెలిసింది.

వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు చంపేస్తానని భార్యను బెదిరించాడు. అంతే ప్లాన్ రివర్స్ అయింది. భర్త బెదిరింపుని సీరియస్‌గా తీసుకుంది. లవర్ తో కలిసి ప్లాన్ చేసి మర్డర్ చేసింది. ఆ తర్వాత పవన్ భార్య జ్యోతి ఆమె ప్రియుడు ప్రమోద్, పంకజ్‌లతో కలిసి కాలువలోకి తోసేశారు.

హత్య జరగడానికి కాస్త ముందే పుట్టింటికి వెళ్లిపోయినట్లుగా చిత్రీకరించింది. తనపై ఎటువంటి అనుమానం లేకుండా ఉండాలనే అలా చేసింది. ముందుగా ఆమె ప్రియుడు.. భర్తతో మందు తాగించాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపారు. మసూరిలోని గంగా కాలువలో డెడ్ బాడీ పారేశారు. గురువారం జరిపిన విచారణలో ఆ ఇద్దరినీ నేరస్థులుగా పరిగణిస్తూ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.