సికింద్రాబాద్ కు చెందిన భూమిక అనే యువతి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒక బోటిక్ లో పని చేస్తుంది.మంగళవారం రాత్రి అనగా 23 ఫిబ్రవరి 2021 రాత్రి యూసఫ్ గూడ చెక్ పోస్ట్ దగ్గర మెట్రో రైల్ ఎక్కేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా ఫోన్ రావడంతో మాట్లాడుతూ నడుస్తుంది.ఇంతలో ఆ యువతి వెనక వచ్చిన ఒక దొంగ ఆమె ఫోన్ లాక్కుని కృష్ణానగర్ వైపు పరుగు తీసాడు. ఊహించని సంఘటనతో మొదట బిత్తర పోయిన ఆ యువతి క్షణాల్లోనే తేరుకుని దొంగ, దొంగ అని అరుస్తూ అతని వెంట పడింది. ఆలా 600 మీటర్ల వరకు పరుగు పెడుతుండగా, ఒక బైకర్ అటుగా వెళ్తూ కనిపిస్తే అతని సహాయంతో దొంగను వెంబడించింది. ఆ దొంగ కృష్ణా నగర్లో సింధు టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్న సందులోకి దూరడాన్ని ఆమె గమనించింది. అక్కడే ఒక గోడ పక్కన అతడు దాక్కుని ఉండడాన్ని చూసి అతనిని పట్టుకొని మొబైల్ లాక్కోవడమే కాకుండా అతడిని 100 కి ఫోన్ చేసి పోలీస్ లకి కూడా పట్టించింది.దీనితో భూమిక గట్స్ ని పోలీసులే కాకుండా అందరు అభినందిస్తున్నారు.