బ్యాంకులకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ అయిదో తేదీ మధ్య నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఉన్నాయి. వీటిలో మూడు రోజులు (మార్చి 30, 31, ఏప్రిల్ 3) మాత్రమే నేరుగా బ్యాంకు శాఖల ద్వారా ఖాతాదార్లకు సేవలు అందనున్నాయి. ఏప్రిల్ ఒకటిన బ్యాంకులకు పనిదినమైనా ఆ రోజు కొత్త ఆర్థిక సంవత్సరం (అకౌంటింగ్ సంవత్సరం) ప్రారంభం నేపథ్యంలో లావాదేవీలు జరగవు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రధానంగా నెలాఖరు కావడంతో ఉద్యోగుల వేతనాలు, చెక్లు ఇతర చెల్లింపులు వంటి వాటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆన్లైన్ సేవలు, ఏటీఎంలలో నగదు సేవలు యథావిధిగా ఉంటాయన్నారు. వరుస సెలవులు వచ్చినప్పుడు, ఏటీఎంలలో నగదు కొరత రాకుండా క్యాష్చెస్ట్ నుంచి తీసి, నింపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతిస్తుందని, అందువల్ల కంగారు పడాల్సిన అవసరం ఉండదని ఎస్బీఐ విశాఖపట్నం డీజీఎం రంగరాజన్ తెలిపారు. తమ లావాదేవీల్లో 65% ఆన్లైన్-యోనో యాప్ ద్వారా జరుగుతున్నందున, గతంలో మాదిరి ఖాతాదార్లకు ఇబ్బందులుండవని వివరించారు.