క్రైమ్ (Crime) వార్తలు (News)

ట్రాఫిక్ పోలీసులపై తిరగబడిన స్థానికులు

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరం బోగాది రింగ్‌ రోడ్డుపై దేవరాజ్‌ బైక్‌ నడుపుతుండగా సురేష్‌ అనే వ్యక్తి వెనుక కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. అదే మార్గంలో పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ చెయ్యెత్తి ఆపమనడంతో బైక్‌‌పై ఉన్న ఇద్దరు అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో దేవరాజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను కోల్పోయాడు.

పోలీసుల ఓవరాక్షన్ వల్లే యువకుడు చనిపోయాడంటూ.. కోపం వచ్చిన స్థానికులు ట్రాఫిక్ పోలీసులను చితక్కొట్టారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బైక్‌ను టిప్పర్‌ ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని, తమ తప్పేం లేదని చెప్పారు. బైక్‌ ప్రమాదంలో గాయపడిన సురేష్‌ తాము పొలీసులకు సుమారు 250 మీటర్ల దూరంలో ఉన్నామని, వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ తమ బైకును డీకొట్టిందని, కిందపడిన తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు.

ఈ వార్త దావాలనంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసులు డబ్బుల కోసం ఎప్పుడంటే అప్పుడు తనిఖీలు చేస్తూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీంతో స్థానికులకు సర్ధి చెప్పే క్రమంలో పోలీసులకు జనానికి మధ్య వాగ్వివాదం ముదిరింది. కొందరు వ్యక్తులు ఏఎస్సైలు స్వామినాయక్, మాదేగౌడ, కానిస్టేబుల్‌ మంజులపై దాడి చేసి అక్కడే ఉన్న ఓ పోలీస్‌ జీపును తలకిందులు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారి ఇలాంటి అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదిలావుంటే, దాడికి గురైన పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.