మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండడంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. నాందేడ్ జిల్లా వ్యాప్తంగా పది రోజుల పాటు అనగా మార్చి 24 నుండి ఏప్రిల్ 4 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని అక్కడి అధికారులు బుధవారం వెల్లడించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే బీడ్ జిల్లాలోనూ పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ చూపెట్టాలని అధికారులు నిర్దేశిస్తున్నారు.