వార్తలు (News)

ప్రారంభం కానున్న ఓర్వకల్లు విమానాశ్రయం

కర్నూలు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా గురువారంనాడు ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభకానుంది. మొత్తం 1,010 ఎకరాల్లో రూ.150 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ఎస్పీ డాక్టర్‌ పకీరప్ప, ఎమ్యెల్యే రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఈనెల 28న బెంగళూరు నుంచి ఓర్వకల్లుకు తొలి విమానం రానున్నట్లు, ఆ తర్వాత ఓర్వకల్లు నుంచి విశాఖ, చెన్నై తదితరల ప్రాంతాలకు విమాన రాకపోకలు సాగుతాయని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.