తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న డిగ్రీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి వెల్లడించారు. ఇదే విషయాన్ని అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తామని పాపిరెడ్డి చెప్పారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆయా యూనివర్సిటీలు నిన్న ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ఉన్నత విద్యామండలి.. సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలకు సూచించింది.