యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద దాదాపు 25 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్ల విలువ దాదాపు రూ. 11.63 కోట్లు ఉంటుందని, దేశాల నుంచి తెప్పించిన బంగారాన్ని అస్సాంలోని గౌహతి నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు. పక్క సమాచారంతో తనిఖీ చేసిన అధికారులు కారు ఎయిర్‌బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్‌ చేసి బంగారం తరలిస్తున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లోని డీఆర్‌ఐ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం ఎలా వచ్చింది.. హైదరాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.