రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కళాశాలలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మూసేయాలని, తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ హెచ్చరికలు జారీచేశారు. ప్రత్యక్ష తరగతులు లేనప్పటికీ ఆన్‌లైన్‌ బోధనను కొనసాగించాలని చెప్పారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగుతాయా?లేదా అనే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.